దిల్ రాజు అంటే ఒక బడా నిర్మాతే కాదు తెలుగు ప్రేక్షకుడి నాడి తెలిసిన నిర్మాత గా దిల్ రాజుకి పేరుంది. ఏ సినిమా అయినా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. దిల్ రాజు నిర్మాణంలో ఇప్పటివరకు 25 చిత్రాలు తెరకెక్కాయి. అందులో హిట్ సినిమాలే ఎక్కువ. అతి తక్కువ సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో ప్లాప్ అయ్యాయి. అలాంటి నిర్మాతతో పనిచేసేందుకు ఏ హీరో అయినా ఆసక్తి కనబరుస్తాడు. కానీ దిల్ రాజుకి మాత్రం ఎప్పటినుండో టాలీవుడ్ లో ఒక హీరోతో సినిమా చెయ్యాలని కోరిక బలంగా వుంది.
ఆయనెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న తన అభిలాషను ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పిన దిల్ రాజు.. ఇప్పుడు ఆ డ్రీమ్ ని నిజం చేసుకునే పనిలో బిజీ అయ్యాడు. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ మధ్యన తాను పవన్ కళ్యాణ్ ని కలిశానని... తనతో కలిసి చెయ్యబోయే మూవీపై పవన్ క్లారిటీ ఇచ్చాడని దిల్ రాజు చెబుతున్నాడు. ఒక మంచి స్క్రిప్ట్ తో దొరకడమే ఆలస్యం.... ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ ని హ్యాండిల్ చెయ్యగల డైరెక్టర్ ని ఎంపిక చేసుకుని సెట్స్ మీదకెళతామని చెబుతున్నాడు.
మరి దిల్ రాజు ఎవరికైనా ఎర వేసాడు అంటే ఆ హీరో ఖచ్చితంగా పడి తీరాల్సిందే అని అంటున్నారు చాలామంది. అలాగే పవన్ మీద దిల్ రాజుకున్న ఆసక్తి చూస్తుంటే వీరి కాంబినేషన్ లో పక్కాగా ఒక చిత్రం తెరకెక్కుతోందని మాత్రం అర్ధమవుతుంది. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిమీద మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.