సినిమా ఇండస్ట్రీలో నారా రోహిత్, శ్రీవిష్ణు లు బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలుసు. రోహిత్ సినిమాల్లోకి వచ్చినప్పటినుండి శ్రీవిష్ణు తో స్నేహాన్ని కొనసాగించుకోవడమేకాదు.. ఇరువురు ఒకరికొకరు తోట్పాటుని అందించుకుని మరీ కెరీర్ ని చక్కబెట్టుకుంటున్నారు. రోహిత్ ద్వారానే శ్రీవిష్ణు సినిమాల్లో నిలదొక్కుకుంటున్నాడు కూడా. ఒకరికోసం ఒకరు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ ఫ్రెండ్స్ ఇద్దరి మద్యన ఒకేరోజు బాక్సాఫీసు వద్ద తలపడే రోజు వచ్చింది.
నవంబర్ 24 నిన్న శుక్రవారం నారా రోహిత్ బాలకృష్ణుడితో వస్తే... శ్రీవిష్ణు మెంటల్ మదిలో తో వచ్చాడు. అయితే పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన నారా రోహిత్ బాలకృష్ణుడు సినిమాకి నెగెటివ్ టాక్ రాగా... శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదికి ఎటువంటి కన్ఫ్యూషన్ లేని టాక్ వచ్చింది. అదే పాజిటివ్ టాక్ తో మెంటల్ మదిలో దూసుకుపోతుంది. బాలకృష్ణుడిని క్రిటిక్స్ అంత ఏకమై చీల్చి చెండాడగా... మెంటల్ మదిలోకి మాత్రం క్రిటిక్స్ ఓవరాల్ గా పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చేసారు. మరి పెళ్లి చూపులు తరహాలో తెరకెక్కిన మెంటల్ మదిలో అదిరిపోయే టాక్ తో అదరగొడుతుండగా.. బాలకృష్ణుడు మాత్రం చిన్నబోయాడు.
మరి ఈ వారం బాక్సాఫీసు బరిలో ఇద్దరు ఫ్రెండ్స్ కయ్యానికి కాలు దువ్వగా అందులో ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. ఆ ఒక్కరు శ్రీవిష్ణు. మెంటల్ మదిలో శ్రీవిష్ణు చేసిన నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా బావుందని యునానమస్ టాక్ తో బాక్సాఫీసుని దున్నేశాలాగే కనబడుతుంది. చూద్దాం కలెక్షన్స్ పరంగా బాలకృష్ణుడిది పై చెయ్యి అవుతుందో.. లేదంటే మెంటల్ మదిలో పైచెయ్యి సాధిస్తుందో చూడాలి.