శర్వానంద్- మారుతి కలయికలో వస్తున్న తాజా చిత్రం 'మహానుభావుడు' ఈ దసరాకే రాబోతుంది. మెహరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ చిత్ర పబ్లిసిటీ కార్య్రక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలయిన అయిన రెండు పాటలు జనాలకి బాగానే ఎక్కేసాయి. అయితే ఈ చిత్రంలో శర్వానంద్ అతి శుభ్రత గా ఉండాలి అనే ఒక జబ్బు ఉన్న యువకుడి పాత్ర లో నటిస్తున్నాడు అని టీజర్ లో తెలియజేసారు. .
అయితే మహానుభావుడు పబ్లిసిటీలో భాగంగా సెప్టెంబర్ రెండో వారంలో జరిగే ఈ చిత్ర ఆడియో వేడుకకి ప్రభాస్ ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే యూవి క్రియేషన్స్ అనేది ప్రభాస్ సొంత సంస్థ గా భావిస్తారు. అందుకే మొన్నామధ్యన తాప్సి నటించిన 'ఆనందో బ్రహ్మ' ఆడియో వేడుకకి కూడా యువి క్రియేషన్స్ వారు పిలిస్తేనే ప్రభాస్ ఆ వేడుకకి అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న 'సాహో' చిత్రానికి కూడా యు వి క్రియేషన్ వారే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మరి ఇదే సాన్నిహిత్యంతో ప్రభాస్ 'మహానుభావుడు' ఆడియో ని విడుదల చేస్తున్నాడు. మరి 'భలే భలే మగాడివోయ్' తో మంచి హిట్ అందుకున్న మారుతీ ఈ చిత్రం తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.