రాజకీయనాయకుల కొడుకులు సినిమాహీరోల అవతారం ఎత్తడం ఇండస్ట్రీకి కొత్తేమీకాదు. వారి పిల్లలు సినిమా సీలెబ్రిటీస్ లాగా మారాలని చాలామంది రాజకీయనాయకులు భావిస్తుంటారు. డబ్బుంటే ఎవరైనా సెలబ్రిటీ ఏం ఖర్మ ఏ అవతారమైన ఎత్తొచ్చు. అసలు ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే ఏపీ విద్యాశాఖామంత్రి అయిన ఘంటా శ్రీనివాసరావు కొడుకు రవితేజ ఇప్పుడు జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో 'జయదేవ్' అనే చిత్రంలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
కానీ ఘంటా శ్రీనివాస్ కి ఉన్న ఇండస్ట్రీ సంబంధాలతో తన కొడుకుని హీరోని చేసి పారేసాడు. ఇక 'జయదేవ్' చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. ఇప్పటికే ఆడియో వేడుకని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ లెవల్లో నిర్వహించింది చిత్ర యూనిట్. గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు అంటేమరి ఆయనేమన్న సదా సీదా హీరోనా ఘంటాకి వారసుడాయె. 'జయదేవ్' ఆడియో వేడుకకి చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, వి.వి.వినాయక్ వంటి సెలబ్రిటీస్ హాజరవగా... వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా అల్లు అర్జున్ ని తీసుకొచ్చేసారు ఘంటా శ్రీనివాస్ గారు. మరి కొడుకుని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్న సినిమా కదా... ఈ మాత్రం హడావిడి లేకుంటే ఎలా అనుకున్నాడో ఏమో..
'జయదేవ్' చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రవితేజ ,తొలిప్రయత్నం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం. అలాగే ఘంటా శ్రీనివాస్ ప్రయత్నాలు ఫలించి రవితేజ టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకుంటాడని కూడా ఆశిద్దాం.