కొత్త దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో కళ్యణ్ రామ్ - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఎమ్యెల్యే సినిమాతోపాటే కళ్యాణ్ రామ్... జయేంద్ర దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలో కళ్యాణ్ రామ్ కి ఒక ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కి చిన్నపాటి గాయాలయ్యాయని.. ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యాక్షన్ సన్నివేశాల్లో ఈప్రమాదం జరిగిందంటున్నారు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ లో రౌడీ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సీన్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. ఆ సీన్స్ చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద రౌడీలను ఛేజ్ చేసే సీన్ లో... బ్రిడ్జి మీద నుంచి ఫ్లాట్ ఫారమ్ మీదకు మెట్ల మీదుగా కాస్త వేగంగా దిగాలి. కానీ అదే టైమ్ లో పై మెట్టు మీద కళ్యాణ్ రామ్ కాలు స్లిప్ అయ్యి కళ్యాణ్ దొర్లుకుంటూ కిందకు పడిపోవడంతో... చేతి మణికట్టు బెణకడంతో.. చెయ్యి బాగా వాచిపోయిందట. అయితే వెంటనే కారవాన్ లో ఓ అరగంట రిలాక్స్ అయిన కళ్యాణ్ రామ్ ని చిత్ర బృందం హాస్పిటల్ కు వెళ్దామంటే.... వద్దని వారిని వారించి బయటకు వచ్చి ఆ సీన్ బిట్ ని కంప్లీట్ చేసాడట.
అలాగే కేవలం ఒక్కరోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ పెయిన్ కిల్లర్స్ సహాయంతో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ డే నే షూటింగ్ స్పాట్ లో వాలిపోయాడట.