నందమూరి వారసుడు బాలకృష్ణ 'పైసా వసూల్' చిత్రం మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. మరి దసరాకి వస్తానని చెప్పిన బాలయ్య ముందే వచ్చేసి నందమూరి ఫాన్స్ కి దసరా పండగని ఒక నెల ముందే ఇచ్చేసాడు. మరి మరో నందమూరి హీరో ఎన్టీఆర్ కూడా తన 'జై లవ కుశ' చిత్రంతో ఈ నెల 21 నే రాబోతున్నాడు. మరి 'జై లవ కుశ' మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన జై, లవ, కుశ లుక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ వెర్రెక్కిపోతుంటే ఇప్పుడు తాజాగా జై, లవ, కుశ ముగ్గురు ఉన్న లుక్ ని ఒకే పోస్టర్స్ లో చూపించి ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ మూడు రకాల లుక్స్ ఓ అదరగొడుతున్నాడు. మూడు పాత్రలు ఒకదానితో ఒకటి సంబందం లేకుండా ఉన్నాయనే విషయం మాత్రం క్లియర్ గా అర్ధమవుతుంది. జై పాత్ర రౌద్రంగా, కోపంగా ఉండగా... లవ లుక్ మాత్రం చాలా కూల్ గా, స్మైలీగా కనబడుతుంది. అలాగే కుశ లుక్ మాత్రం ఒక డాన్సర్ గా కనబడుతుంది. ఇప్పటివరకు డాన్స్ లకు, నటనకు విజిల్స్ వేయించుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు నట విశ్వరూపంతో మూడు పాత్రల్లో చెలరేగిపోనున్నాడు. అలాగే మరో పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చూపిస్తూ ఇద్దరు హీరోయిన్స్ అయినా రాశి ఖన్నా, నివేత థామస్ ల లుక్ ని కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్.
మరి పోస్టర్ లో లుక్ ని బట్టి రాశి ఖన్నా మోడరన్ గా ఇరగదీసేలా వుంది. అలాగే నివేత థామస్ మాత్రం హోమ్లీగా ట్రెడిషనల్ లుక్ లో కనబడుతుంది. ఇక జై లవ కుశ పాటలు సెప్టెంబర్ 3 న మార్కెట్ లోకి విడుదల చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఒక నందమూరి హీరో బాలయ్య 'పైసా వసూల్' తో థియేటర్స్ లో సందడి చేస్తుంటే... మరోపక్క ఎన్టీఆర్ కూడా 'జై లవ కుశ'తో థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు.