యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో తొలి సారి త్రిపాత్రభినయం చేసిన సినిమా జై లవ కుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా సంధర్బంగా రిలీజ్ అయ్యి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగటివ్ పాత్రలో నటించాడు. జై అనే ఈ పాత్ర సినిమాకే అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేయడానికి అక్కడ తమిళ నిర్మాతలు ట్రై చేస్తున్నారట. మరి నిర్మాతలు అనుకున్నారో లేదో.. జై లవ కుశ సినిమా ని అక్కడి స్టార్ హీరో అయిన విజయ్ వీక్షించాడట.
జై లవ కుశ లోని ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయిపోయిన విజయ్, వెంటనే ఈ జై లవ కుశ సినిమాని రీమేక్ చేయాల ని భావిస్తున్నాడు అని తెలుస్తుంది. నిర్మాతలకు కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఈ సినిమా తమిళ్ హక్కుల ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని చూస్తున్నారు. విజయ్ తమిళ్ లో మంచి మాస్ హీరో. ఇప్పటివరకు విజయ్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించలేదు. జై క్యారెక్టర్ కూడా కోలీవుడ్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది అని తమిళ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ త్రిపాత్రాభినయం విజయ్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లా ఉంటుంది. మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ ని తమిళ జనాలు ఒక మంచి నెగటివ్ రోల్ లో చూడొచ్చు. చూద్దాం ఫైనల్ గా ఈ జై లవ కుశ తమిళ రీమేక్ లో ఎవరు నటిస్తారో.