ఎన్టీఆర్, మహేష్ కన్నా శర్వా కోసమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట

Update: 2017-08-31 09:00 GMT

ఈ దసరా బరిలో ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ బాబు 'స్పైడర్' లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ దసరాకే ఫిక్స్ అయ్యి డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి కూడా. అయితే ఈ రెండు చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలతోపాటే మారుతీ డైరెక్షన్ లో శర్వానంద్ - మెహ్రీన్ లు జంటగా వస్తున్న 'మహానుభావుడు' చిత్రం కూడా ఈ దసరాకే రాబోతున్నట్టు చెబుతున్నారు. కానీ పక్కా సమాచారం అయితే లేదు.

అయితే ఇప్ప్పుడు ఈ దసరాకి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు 'జై లవ కుశ, స్పైడర్' ల కన్నా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ 'మహానుభావుడు' మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఎందుకంటే ఈ మధ్యన ఓవర్సీస్ లో చిన్న చిత్రాలైన 'ఫిదా, నిన్నుకోరి, అర్జున్ రెడ్డి' చిత్రాలు బయ్యర్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పెద్ద చిత్రాల కన్నా ఎక్కువగా 'మహానుభావుడు' చిత్రానికే ఓవర్సీస్ బిజినెస్ వర్గాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయట. అందులోను మారుతీ ఈ మధ్యన ఏ గ్రేడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ కే ఓటెయ్యడంతో.. మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలకు ఇప్పుడు ఓవర్సీస్ లో గిరాకీ ఏర్పడింది.

నాని ని మతిపరుపు కేరెక్టర్ లో పెట్టి 'భలే భలే మగాడివోయ్' అంటూ తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ అవడం... ఇప్పుడు 'మహానుభావుడు' టీజర్ తోనే సినిమాపై మంచి అంచనాలు తీసుకురావడం వంటివాటితో మారుతి సినిమాలకు మంచి డిమాండ్ వచ్చేసింది. అంతేకాకూండా శర్వానంద్ చిత్రాలన్నీ ఓవర్సీస్ లో మంచి విజయాలు సాధించడంతోనే ఈ 'మహానుభావుడి' సినిమాపై అంచనాలు ఏర్పడడానికి కారణం అంటున్నారు. మరి మారుతీ - శర్వాల కాంబోలో వచ్చిన ఈ 'మహానుభావుడు' కూడా రెండు భారీ చిత్రాలని తట్టుకుని నిలబడగలదనే నమ్మకంతో ఉన్నారు ఓవర్సీస్ జనాలు. ఇప్పటికే 'మహానుభావుడు' ఓవర్సీస్ రైట్స్ కి మూడు కోట్లు పలికిందని టాక్ కూడా వినబడుతుంది.

Similar News