ఎన్టీఆర్ ఇప్పుడు 'జై లవ కుశ' ప్రమోషన్ తోనూ, బుల్లితెర మీద బిగ్ బాస్ ఎండింగ్ ఎపిసోడ్స్ కోసం బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' మరో వారంలోనే థియేటర్ల లోకి దిగిపోయి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడానికి రెడీ అయ్యింది. ఈ లోపు 'జై లవ కుశ' ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ లో నిర్వహించడానికి చిత్ర బృందం ఏర్పాట్లు షురూ చేసింది. మరోపక్క ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కూడా మరో 10 రోజుల్లో ముగియనుంది. అయితే బిగ్ బాస్ కి ఎన్టీఆర్ కేవలం నాలుగు ఎపిసోడ్స్ కి షూట్ కోసం కేటాయిస్తే సరిపోతుంది. మొత్తానికి మరో 10 , 15 రోజుల్లో ఎన్టీఆర్ పూర్తిగా ఖాళీ అవుతాడు.
మరి ఈ 15 రోజుల తర్వాత ఎన్టీఆర్ ఏం చెయ్యబోతున్నాడు అంటే.... మొదటగా ఎన్టీఆర్ యూరప్ వెళ్లి అక్కడ డీ టాక్సినేషన్ సెంటర్ లో దాదాపు ఒక నెలరోజులు పాటు థెరపీ చేయించుకుంటాడట. మరి ఇలా తారలు డీ టాక్సినేషన్ కోసం విదేశాలకు ఎందుకువెళ్తారు అంటే.... తమ శరీరంలో పెరిగిపోయిన కొవ్వును ఈ థెరపీ ద్వారా కరిగించుకోవడానికి అంట. ఇప్పుడు ఈ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. ఇక యూరప్ లో ఒక నెలరోజులు థెరపీ చేయించుకున్న తర్వాత ఎన్టీఆర్ మలేషియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాడట.
ఇక ఆ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కోసం కూడా ఎన్టీఆర్ ఒక నెల కేటాయించబోతున్నాడట. మరి త్రివిక్రమ్ తో చేసే సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా మార్షల్ ఆర్ట్స్ గట్రా నేర్చుకుని న్యూ లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడట. త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడట. ఇక ఎలాగూ త్రివిక్రమ్, పవన్ 25 వ చిత్రంతో బిజీగా ఉండడం వలన ఒక రెండు మూడు నెలలు ఎన్టీఆర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఈ లోపు ఎన్టీఆర్ ఈ ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో సినిమా మాత్రం వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి సెట్స్ మీదకెళుతుందని చెబుతున్నారు.