ఎన్టీఆర్ బయోపిక్ విషయమై హర్ట్ అయిన బాలయ్య

Update: 2017-12-29 14:00 GMT

బాలయ్య నిర్మిస్తున్న తేజ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ తెలియదు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ షూట్ బిగినింగ్ అంటూ వార్తలు బయటకు వచ్చేసాయి. గురువారం బిగినింగ్ అంటే బుధవారం వార్తలు బయటకు వచ్చాయి. అంతా సీక్రెట్ గా వుంచుదామనుకున్న బాలయ్య మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు.

అసలు ఎవరు చెప్పారు.... బయట వాళ్లకి అని ఆరా తీస్తే.. ఈ సినిమాకు పని చేసే ఒక టెక్నీషియన్ వైపు నుంచే ఈ లీక్ వెళ్లిందని అనుమానాలు యూనిట్ లో వున్నాయి. అయితే ఆ టెక్నీషియన్ తెలుసో తెలియకో తాను చేసే సినిమాల విషయాలు బయట మనుషులకు, మీడియా కు లీక్ చేస్తున్నాడని గుసగుసలు వున్నాయి.

దీంతో గురువారం టీజర్ షూట్ కు బాలయ్య ఫుల్ సెక్యూరిటీ పెట్టారంట. ఈ షూట్ కి చాలా కొద్దిమందినే స్పాట్ కు రావాలని బాలయ్య హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అలానే సెల్ ఫోన్స్ కూడా లోపలికి తీసుకుని రాకూడదని బాలయ్య షరతు పెట్టాడంట. ఈ కార్యక్రమం వివరాలు కానీ, ఫొటోలు కానీ ఏవీ ఇప్పుడు విడుదల చేయవద్దని, మంచి రోజు చూసి తాను చెబుతానని.... అప్పుడే ఇవ్వాలని బాలయ్య కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.

Similar News