'జై లవకుశ' సినిమా రిలీజ్ అయ్యి నెల రోజలు అయిపోయింది. కానీ ఎన్టీఆర్ అభిమానులలో ఒక సందేహం మిగిలిపోయింది. సినిమాకి ముందు తారక్ ఒక విషయాన్ని సస్పెన్సులో పెట్టేశాడు. తారక్.. 'జై లవకుశ' ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ..ఈ సినిమా చేయాలా వద్ద అన్నపుడు నాకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సలహా అడిగాను. వాళ్లు ఒకే అన్న తర్వాతే నేను సినిమా చేసానని... కానీ వాళ్ళ పేర్లు మాత్రం సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాతే చెపుతానని సస్పెన్సులో పెట్టేసాడు.
సినిమా రిలీజ్ అయ్యి నెల రోజలు అయినప్పటికీ వాళ్ళ పేర్లు చెప్పలేదు. అయితే ఎన్టీఆర్ చెప్పడానికంటే ముందు ‘జై లవకుశ’ రచయిత కోన వెంకట్ ఈ సీక్రెట్ రివీల్ చేసేశాడు. ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ సంగతి చెప్పాడు కోన. ఆ ఇద్దరు ఎవరో కాదని.... ఎన్టీఆర్ కి అత్యంత ఇష్టమైన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి.. కొరటాల శివలేనట. దీంతో అభిమానులకి ఊరట కలిగింది. రాజమౌళి-ఎన్టీఆర్ కి వున్న అనుబంధం గురించి వేరే చెప్పనవసరంలేదు. రాజమౌళి, ఎన్టీఆర్ ని ఎపుడు గైడ్ చేస్తూనే ఉంటాడు. కొరటాల కొంచెం లేటుగా తారక్ ఫ్రెండయ్యాడు. అతను కూడా ఆత్మీయుడే.
తారక్ అభిమానులు ముందు నుండే అనుకున్న పేర్లు కాబట్టి పెద్దగా ఆశ్చర్యానికి లోనవ్వలేదు. 'జై లవకుశ' తర్వాత తారక్ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా కి చేయటానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.