'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నప్పటికీ... 'జై' టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే 'జై' టీజర్ సంచనాలు క్రియేట్ చెయ్యగా... 'లవ' ఫస్ట్ లుక్ చప్పగా ఉందన్నారు కానీ 'లవ' టీజర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మాత్రం అందరిలో కనిపిస్తుంది. ఇక 'జై లవ కుశ' సెప్టెంబర్ 21 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ రెండు పాటల మినహా దాదాపు కంప్లీట్ అయినట్లు చెబుతున్నారు.
ఇకపోతే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో జరిగింది. ఇక మిగిలిన ఓవర్సీస్ లో కూడా జై లవ కుశ కి మంచి రేటు పలికినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సినిమాలు ఓవర్సీస్ లో భారీ ధర లకు అమ్ముడు పోతున్నాయి. అయినా ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ఓవర్సీస్ లో బాగా పెరిగింది. అక్కడ టాలీవుడ్ మూవీస్ మంచి కలెక్షన్స్ సాధించి టాప్ ప్లేస్ లో కూర్చుంటున్నాయి. అందుకే అన్ని రకాల కలెక్షన్స్ ఒక ఎత్తైతే అక్కడ ఓవర్సీస్ కలెక్షన్స్ ఒక ఎత్తులా ఉన్నాయి. ఇక జై లవ కుశ ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటివరకు అమ్ముడు పోకుండానే ఉంది. జై లవ కుశ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ చెప్పిన ధర చూసిన ఓవసిస్ డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆలోచనలో ఉండబట్టే ఇప్పటివరకు ఓవర్సీస్ లో జై లవ కుశ బిజినెస్ జరగలేదంటున్నారు.
అయితే ఇప్పుడు జై లవ కుశకి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళు 8.5 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ బట్టి ఆలోచిస్తే ఇది మంచి రేటే అని చెప్పాలి. అయితే ఇంతకముందు ఎన్టీఆర్ సినిమాలు కూడా మంచి బిజినెస్ చేశాయి. కానీ వాటికి ఈ సినిమాకు పలికినంత భారీ ధర అయితే రాలేదు. మరి జై లవ కుశకి మహేశ్ బాబు సినిమా స్పైడర్ నుండి కూడా పోటీ గట్టిగానే ఉంది. ఇంత పోటీలో కూడా జై లవ కుశకి అంత భారీ రేటు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈలెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జై లవ కుశ రికార్డు సృష్టించలేదు., అక్కడ ఓవర్సీస్ లో కూడా జై లవ కుశ రికార్డు రేటు కొట్టేసింది.