కెరీర్ స్టార్టింగ్ లోనే అద్భుతమైన హిట్స్ సాధించి ఆ తర్వాత కెరీర్లో ఎక్కువగా ప్లాపులు ఎదుర్కున్న ఎన్టీఆర్ గత మూడు సినిమాలనుండి హిట్ ట్రాక్ ఎక్కాడు. 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్' వంటి హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కట్టే స్టేజ్ లో ఎన్టీఆర్ ఉన్నాడు. కాకపోతే స్టార్ డైరెక్టర్స్ వెంటే ఎన్టీఆర్ పడతాడని నానుడి కూడా ఉందనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో పేరు కొట్టేసిన రాజమౌళి ఒక మంచి కథతో ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
అయితే అంత క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం చచ్చినా చెయ్యనని చెబుతున్నాడు ఒక డైరెక్టర్. ఆయనెవరో కాదు ఎప్పటినుండో హిట్ కోసం మొహం వాచీ ఈ మధ్యనే 'నేనే రాజు నేనే మంత్రి' తో యావరేజ్ హిట్ అందుకున్న డైరెక్టర్ తేజ. తేజ కి ఎన్టీఆర్ తో అవకాశం వస్తే చచ్చినా చెయ్యడట. మరి పెద్ద స్టార్ డైరెక్టర్ కూడా కాదు ఆయన. అలాంటి తేజ ఇంతపెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే అందుకేదో గట్టి కారణమే కనబడుతుంది. అయితే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యనని చెప్పిన ఆ డైరెక్టర్ ఎందుకు చెయ్యనంటున్నాడో క్లారిటీ కూడా ఇస్తున్నాడు.
ఆ కారణమేమిటంటే ఎన్టీఆర్ స్క్రిప్ట్ లోనే కాకుండా దర్శకత్వంలోను వేలు పెడతాడట. అది తేజకు సుతారమూ నచ్చదట. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి తేజకి ఇష్టం లేదట. మరి అంతమాటన్న తేజకి ఎన్టీఆర్ ఎలాంటి రిప్లై ఇస్తాడో అనేది వేచి చూద్దాం. అయినా తారక్, తేజ కి కౌంటర్ ఇస్తాడో లేకుంటే ఈ డైరెక్టర్ తో నాకెందుకులే అని మిన్నకుంటాడో చూద్దాం.