ఎన్టీఆర్ తో కాదు రవితేజతో.

Update: 2017-12-24 09:00 GMT

మంచి కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా.. హీరో అవతారమెత్తిన సునీల్.. ఇప్పుడు మళ్ళీ కమెడియన్ గా మరబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిన సునీల్ హీరోగా చేస్తూనే కమెడియన్ గా కూడా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మరోపక్క హీరో అవకాశాలు కూడా సన్నగిల్లడం సునీల్ ఈ డెసిషన్ కి కారణమని స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే సునీల్, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాతో కమెడియన్ గా కమ్ బ్యాక్ అవుతాడనుకున్నారు అంతా.

కానీ ఇప్పుడు రవితేజ అప్ కమింగ్ మూవీలో కామెడీ రోల్ చేయబోతున్నాడు సునీల్. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరి రవితేజ - సునీల్ ది సూపర్ హిట్ కాంబినేషన్. అప్పుడెప్పుడో వచ్చిన దుబాయ్ శీను నుంచి సునీల్ హీరోగా మారకముందు చేసిన మిరపకాయ్ వరకు వీళ్లిద్దరి కాంబోలో కామెడీ అదిరిపోయింది. ఇప్పుడు మరోసారి రవితేజ సినిమాతోనే కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు సునీల్. ఇది శ్రీనువైట్ల సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది.

అలాగే సునీల్ ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. చిరంజీవి సైరా సినిమాలో ఈ కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే అది కామెడీ రోల్ కాదని తెలుస్తోంది. ఇలా చూసుకుంటే సునీల్ కు కమెడియన్ గా రీఎంట్రీ మూవీ రవితేజ సినిమానే కానుంది.

Similar News