బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ - చరణ్ లని హీరోస్ గా పెట్టి డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. జులైలో ఈ సినిమాపై వర్క్ షాప్ ను నిర్వహించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.
ఈ వర్క్ షాప్ లో చరణ్ - ఎన్టీఆర్ పాల్గొననున్నారు. దాదాపు 20 రోజులు పాటు సాగే ఈ వర్క్ షాప్ లో ఎన్టీఆర్ .. చరణ్ లకు రిహార్సల్స్ ను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. గతంలో బాహుబలి సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా రాజమౌళి..రానా - ప్రభాస్ లకు వర్క్ షాప్ నిర్వహించాడు.
మళ్లీ ఇప్పుడు చరణ్ - ఎన్టీఆర్ కు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. . ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్ కానీ.. విల్లన్స్ కానీ ఎవరిని ఇంకా సెలెక్ట్ చేయలేదు. త్వరలోనే వారిని సెలెక్ట్ చేసి ఆ వివరాలను వెల్లడి చేయనున్నారు చిత్ర యూనిట్.