ఎన్టీఆర్ కి ఇవ్వాల్సింది ఇచ్చేశాడంట

Update: 2017-09-01 10:00 GMT

ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ ని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ లో 'జై లవ కుశ' ని చేస్తున్నాడనే టాక్ సినిమా మొదలెట్టక ముందు నుండే వుంది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా, హీరోగా వరుస పరాజయాలతో ఉన్నాడు కాబట్టే ఆయన నిర్మాతగా ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడంటున్నారు. తమ్ముడు డెసిషన్ బాగా నచ్చిన కళ్యాణ్ రామ్ కూడా సినిమాకి భారీ బడ్జెట్ పెట్టేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. తమ్ముడు మీదున్న గౌరవంతోనే తమ్ముడు వద్దని వారించినా 'జై లవ కుశ'కు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్ అని ప్రచారం జోరుగా జరిగింది. ఇక తారక్ ఈ సినిమాకి రెమ్యునరేషన్ కింద చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నాడనే టాక్ కూడా నడుస్తుంది.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం తన తమ్ముడు ఎన్టీఆర్ మార్కెట్ రేటు ఎంత ఉందొ అంత ఇచ్చేసాడంటున్నారు. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి గాను 13 నుండి 14 కోట్ల ఛార్జ్ చేస్తాడని... ఆలెక్క ప్రకారమే కళ్యాణ్ రామ్ తారక్ కి 14 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేసాడంటున్నారు. అయితే 'జై లవ కుశ' కు నిర్మాతగా టేబుల్ ప్రాఫిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇలా తన తమ్ముడికి ఇవ్వాల్సింది ఇచ్చాడని కూడా అంటున్నారు. ఇక 'జై లవ కుశ' విడుదల డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్టీఆర్ ఫాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

తమ హీరో మూడు పాత్రలని ఎలా హ్యాండిల్ చేసాడో అని మొన్నటిదాకా తెగ ఇదైనా ఫాన్స్ 'జై లవ కుశ' లుక్స్ చూసాక పూర్తి సంతృప్తిలో ఉన్నారు. ఇక సినిమా అంతటా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడడానికి ఫాన్స్ కి మరో 20 రోజుల టైం మాత్రమే ఉండడంతో ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక 'జై లవ కుశ' ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Similar News