ఎట్టకేలకు స్పష్టత వచ్చింది

Update: 2018-01-08 13:00 GMT

యాంగ్రీ యంగ్ మాన్ తరహా పాత్రలతో మాస్ ని, సెంటిమెంట్ చిత్రాలతో ఫామిలీ ప్రేక్షకులని ఒక దశాబ్దం పాటు అలరించిన హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత పి.ఎస్.వి.గరుడ వేగా చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. రెవిన్యూ పరంగా చిత్రం కొంచం వెనుకంజలో నిలిచినప్పటికీ రాజశేఖర్ చేసిన సాహసోపేతమైన ప్రయత్నానికి ప్రేక్షకుల మన్ననలు దక్కాయి. దీనితో ఒక వైపు తన బౌన్స్ బ్యాక్ ఎంజాయ్ చేస్తూ మరో వైపు తన వారసురాలు శివాని వెండితెర పరిచయానికి సరైన ప్లాట్ఫార్మ్ ఏర్పరిచే పనులలో కొంత కాలంగా బిజీగా వున్నారు రాజశేఖర్.

ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత చేతన్ భగత్ రచించిన 2 స్టేట్స్ నవల ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం ద్వారా శివాని ని వెండితెరకి పరిచయం చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ నవల ఆధారంగా బాలీవుడ్ లో అదే పేరుతో విడుదలైన చిత్రంతో వెండితెరకి పరిచయమైన కథానాయిక ఆలియా భట్ విజయవంతంగా తన యాక్టింగ్ కెరీర్ ని కొనసాగిస్తోంది. అందుకే రాజశేఖర్ ఇలాంటి లవ్ స్టోరీ తో శివాని ఎంట్రీ చేయటం మంచిందని భావిస్తున్నారు. రెండు వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయక నాయికల మధ్య సాగే ప్రేమ కథ నేపథ్యంలో వుండే ఈ చిత్రం లో శివాని ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన అమ్మాయిగా కనిపించనుందట.

Similar News