రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని ఎంసీఏ హవా మాములుగా లేదు. సినిమా రోటీన్ గా ఉన్నప్పటికీ నాని నేచురల్ యాక్టింగ్, సాయిపల్లవి ఎప్పీయరెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా మారాయి. అందుకే మొదటి రోజు 7 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా.. ఈ 3 రోజుల్లో తన కౌంట్ ను అటుఇటుగా 14 కోట్ల రూపాయలకు పెంచుకుంది. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఎంసీఏ సినిమా అటు ఓవర్సీస్ లో కూడా 5 లక్షల డాలర్లు (హాఫ్-మిలియన్) క్లబ్ లోకి చేరింది.మరి సినిమా యావరేజ్ టాక్ తోనే ఇంత వసూళ్ల పంట పండుతుంటే.. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం ఎంసీఏ కి లాభాల పంట పండేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో ఎంసీఏ వసూళ్లు చూద్దాం
నైజాం – 5.95
సీడెడ్ – 2 .0
ఉత్తరాంధ్ర – 1.79
గుంటూరు- 1.03
తూర్పు గోదావరి- 1.04
పశ్చిమ గోదావరి – 0.82
కృష్ణా – 0.86
నెల్లూరు – 0.42 కోట్లు
3 రోజుల మొత్తం షేర్ – 13.91 కోట్లు