అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమారంగంలోకి అడుగుపెట్టిన అక్షర హాసన్ మెల్లగా హీరోయిన్ అవతారమెత్తింది. కాకపోతే నటించినవి చాలా తక్కువ సినిమాలే. కమల్ హాసన్ కి కూతురుగా కాకుండా ఒక నటిగానే మంచి గుర్తింపు పొందింది అక్షర. కోలీవుడ్ లో అజిత్ కి జోడిగా అక్షర, కాజల్ నటించిన వివేగం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా అక్షర మీడియాకి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ తన సినిమా విశేషాలను మీడియా మిత్రులతో పంచుకుంటుంది.ఇక తాను మతం మార్చుకున్నానని.... ఇటీవలే తాను బౌద్ధమతం తీసుకున్నానని అక్షర హాసన్ ఒక ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
అలాగే తాను నటిగా మారినప్పుడు తన తల్లితండ్రుల ఐడెంటిటీతో తాను సినిమాల్లోకి రాలేదని... ఆ విషయంలో చాలా సంతోషంగా వున్నానని అంటుంది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా తెర వెనుక టెక్నీకల్ ఇబ్బందులు గురించి తెలుసుకున్నానని, దీంతో ఇప్పుడు కెమెరా ముందు ఎలా ఉండాలో తనకి బాగా తెలుస్తోందని అక్షర తెలిపింది. ఇక అక్షర ఎందుకోసం మతం మారిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదుగాని తాను బౌద్ధమతం తీసుకున్నానని మాత్రమే వెల్లడిస్తుంది.