ఒక సినిమా విడుదలవుతుంది అంటేనే.. ఆ సినిమాకి ఎంత ప్రమోషన్ చెయ్యాలో అంత ప్రమోషన్ చేస్తేనే ఆ సినిమా విడుదలవుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ వచ్చినా ఫట్ టాక్ వచ్చిన కూడా... ఏ సక్సెస్ సెలెబ్రేషన్స్ అయినా లేకుంటే ఏ థాంక్స్ మీటో అయినా పెట్టడమే కాకుండా హీరోహీరోయిన్స్ ఇంటర్వ్యూ లు గట్రా ఉంటె ఆ సినిమా కి కావాల్సినంత ప్రమోషన్ వచ్చేసి సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం బాగా ఉంటుంది. ఉదాహరణకి నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గదిని తీసుకోండి. సినిమా విడుదలకు ముందునుండే నాగార్జున, సమంత, దర్శకుడు ఓం కార్ ప్రమోషన్స్ ఇరగదీసాడు.
అలాగే సినిమా విడుదలై మిశ్రమ స్పందన వచ్చిందని తెలియగానే మళ్ళీ... రాజాగారి సక్సెస్ సెలెబ్రేషన్స్, అలాగే నాగ్, సమంత ల ఇంటర్వ్యూ లు.. ఇలా ఇంకా ప్రమోషన్స్ అదరహోడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్స్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాకి కరువైందంటున్నారు. రాజా ది గ్రేట్ సినిమాకి సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ చాలనుకుని నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ ని గాలికొదిలేసాడంటున్నారు. అటు మీడియాకి గాని ఇటు ప్రింట్ మీడియా విషయంలో గాని రాజా ది గ్రేట్ టీమ్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే రాజా ది గ్రేట్ కి మొదటి రోజు కేవలం 4.9 కోట్లు షేర్ వచ్చిందని.. ప్రమోషన్స్ గనక అదిరిపోయే రేంజ్ లో ఉంటేగనక సినిమాకి 7 కోట్ల దాకా షేర్ వచ్చేదని కూడా అంటున్నారు.
మరి మిశ్రమ స్పందన తెచ్చుకున్న రాజా ది గ్రేట్ చిత్రం ఇలా మొదటి రోజు షేర్ చూస్తుంటే ఈ సినిమా 30 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుందంటున్నారు. ఒకవేళ 30 కోట్ల షేర్ రాజా ది గ్రేట్ సినిమా గనక వసూలు చెయ్యకపోతే మాత్రం పంపిణీదారులు లాస్ అవుతారనే టాక్ వుంది. మరి ప్రమోషన్స్ లో మంచి పట్టున్న దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎందుకు లైట్ తీసుకున్నట్టు... అయినా సినిమాకి ప్రమోషనే... సగం సక్సెస్ అనే విషయం తెలిసి కూడా రాజా ది గ్రేట్ చిత్ర బృందం ఇంత కూల్ గా ఎలా వున్నారో అంటున్నారు.