ఎంతందంగా ఉన్నావే... ఎవరే నీవు?

Update: 2018-01-29 08:59 GMT

నిన్నమొన్నటిదాకా టాలీవుడ్, కోలీవుడ్ లలో ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ కి గత ఏడాది మంచి హిట్స్ అందుకుని అమాంతంగా ఫామ్ లోకొచ్చేసింది. కానీ కాజల్ కి ఓ... అన్నంత అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. చేతిలో అంతగా సినిమాలు లేకపోయినా అమ్మడు మాత్రం గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతగా ఎక్స్పోజింగ్ చేసినా కాజల్ కి అనుకున్నంత అవకాశాలు రాకపోవడానికి మెయిన్ రీజన్ మలయాళ భామలు టాలీవుడ్ ని ఏలుతూ పాత హీరోయిన్స్ అయిన కాజల్, తమన్నా వంటి భామలకు గట్టి పోటీ నివ్వడమే.

మరి అవకాశాలు నాకెలా రావో చూస్తానంటూ కాజల్ ఈ మధ్య హాట్ ఫోటో షూట్స్ మీద పడింది. తనలో ఇంకా గ్రేస్ తగ్గలేదు అని నిరూపించడం కోసమే అన్నట్టుగా ఫోటో షూట్ కోసం ఏ మాత్రం రాజీ పడకుండా ఫోజులు ఇచ్చేస్తోంది. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ రూపొందిస్తున్న క్యాలెండర్ కోసం కాజల్ ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చింది. ఇవి చూస్తే కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటిందా అంటే నమ్మటం కష్టమే అనిపిస్తోంది.

అంత హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు మతులు పోగొట్టేస్తుంది. గత ఏడాది ఖైదీ నెంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి హిట్స్ తో చెలరేగిపోయిన కాజల్ కి ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఎమ్యెల్యే, నాని నిర్మాతగా తెరకెక్కిన అ! సినిమాలో నటిస్తుంది. మరి కాజల్ హాట్ హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ని మీరు ఓ లుక్కేసుకోండి.

Similar News