ఎంత స్కెచ్ వేశారు

Update: 2017-08-30 12:03 GMT

మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతంలో మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ తో ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చిందనుకున్నారు అంతా. కానీ భావన కిడ్నాప్ అయినప్పటినుండి ఈ కేసు అనేక మలుపు లు తిరిగి చివరికి నటుడు దిలీప్ దగ్గర ఆగింది. కానీ దిలీప్ తోపాటు భావన కిడ్నాప్ కేసులో ఆయన రెండో భార్య కావ్య మాధవన్‌ కూడా ఉందని.... విషయం తెలుసుకున్న పోలీస్ లు కావ్య వస్త్ర దుకాణంపై, కావ్య ఆఫీస్ లపై దాడులు కూడా నిర్వహించారు.అయితే కావ్య మాధవన్ మాత్రం తాను తన భర్త దిలీప్ నిర్దోషులమని.. తమకెలాంటి కిడ్నాప్ లు తెలియవని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే దిలీప్ అరెస్ట్ తర్వాత కావ్య మాధవన్‌ పేరు తరుచూ మీడియాలో వినబడుతూనే ఉంది. భావన కేసులో నిందితుడిగా ఉన్న పల్సర్‌ సునిని పోలీసులు ఎర్నాకులం సెషన్స్‌ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పల్సర్ సుని భావనపై అఘాయిత్యానికి పాల్పడమని హీరో దిలీప్ భార్య నటి కావ్య తమకు సూచనలు ఇచ్చారని ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని ఈరోజు బుధవారం మీడియాతో బహిరంగంగా చెప్పాడు. ముందు నుంచి తాను చెబుతున్న మేడమ్‌ కావ్యనే అని పల్సర్ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. పల్సర్ చెప్పింది చూసాక అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట.

కిడ్నాప్ చేసి ఆమెని లైంగికంగా వేధించి ఫోటోలు, వీడియో లు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యాలని హీరో దిలీప్ చెప్పగా.. ఆయన భార్య కావ్య మాధవన్ మాత్రం డబ్బు విషయంలో ఆ నిందితులకు సహకరించినట్టుగా ముందునుండి ప్రచారంలో ఉంది. మరి ఇప్పుడు పల్సర్ సుని చెప్పిన దాని ప్రకారం కావ్య మాధవన్ ని అరెస్ట్ చేసే సూచనలు ఉన్నట్టుగా చెబుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో?

Similar News