కోలీవుడ్ హీరో విశాల్ మంచి దూకుడు మీదున్నాడు. ప్రతి విషయంలోనూ దూకుడుగా ప్రవర్తిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో నిద్ర పోతున్నాడు. నడిగర్ సంగం ఎన్నికల సమయంలో రాధికా, శరత్ కుమార్ లతో చెడుగుడాడిన విశాల్ ఇప్పుడు పైరసి మీద రెచ్చిపోతున్నాడు. తమిళనాట పైరసీ దారులను రోడ్డుకీడుస్తానంటూ ఛాలెంజ్ లు చేస్తున్నాడు. అన్ని భాషల కన్నా ఎక్కువగా కోలీవుడ్ లోనే సినిమాల పైరసీ భూతం అనేది ఎక్కువగా వుంది. అక్కడ కొని వెబ్సైట్ ఈ పైరసీని ప్రోత్సహించి నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇక విశాల్ పైరసీ వెబ్సైట్స్ పనిపడతానంటూ ప్రకటించడమే కాదు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు. ఇప్పటికే తమిళ రాకర్స్ వెబ్సైటు పని పట్టి అడ్మిన్ ని క్లోజ్ చేయించిన విశాల్ తన అభిమానులతో కలిసి ఆయా వెబ్సైట్స్ పనిపట్టేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇక విశాల్ యాక్టివిటీస్ కి ఆ తమిళ పైరసీవెబ్సైట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా విశాల్ తాజా చిత్రం తుప్పరివాలన్ చిత్రం అలా విడుదలైందో లేదో ఇలా పైరసీ చేసి తమ సత్తా ఏమిటో విశాల్ కి అర్ధమయ్యేలా చేశారు. అయినా విశాల్ బెదరకుండా ఏడాదిలోపు ఈ పైరసీ వెబ్సైట్స్ ని మూయిస్తానంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు. అసలు కోలీవుడ్ లో ఎక్కడా పైరసీ అనేది లేకుండా చేస్తానని విశాల్ ప్రకటించాడు. అయితే విశాల్ చేస్తున్న ప్రకటనకు రెచ్చిపోయిన తమిళ రాకర్స్ పైరసీ వెబ్సైట్ విజయ్ మెర్సిన్ సినిమా విడుదలవగానే పైరసీ చేస్తామని ఛాలెంజ్ కూడా విసిరింది.
అయితే ఇంత యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ పైరసీ వెబ్సైట్స్ అస్సలు తగ్గడంలేదంటే... ఆ పైరసీ దారులకు పంపిణీదారుల్లోనే చాలామంది సహాయం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాకూండా ఆ పైరసీ దారులకు పొలిటికల్ గా కూడా సపోర్ట్ ఉందంటున్నారు. మరి అంతలా పాతుకుపోయిన ఆ పైరసీ రాయుళ్లను విశాల్ ఏమాత్రం ఎదుర్కుంటాడో చూద్దాం.