హరికృష్ణ కొడుకులైన జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు మొదట్లో పెద్దగా సఖ్యతగా ఉండేవారు కాదు. నందమూరి ఫ్యామిలిలో ఉన్న లుకలుకలు వలన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ హరికృష్ణ అనారోగ్యం వలన మళ్ళీ అన్నదమ్ములిద్దరూ ఒక్కటయ్యారు. అయినా కళ్యాణ్ రామ్ కి తన తమ్ముడు ఎన్టీఆర్ అంటే ఎప్పుడూ ప్రేమే. కాని బాలకృష్ణ వాళ్లందరితో కలిసిమెలిసి ఉండాలంటే తన తమ్ముడిని కాస్త చూసి చూడనట్టు ఉండేవాడు కళ్యాణ్ రామ్.
ఇక జానకి రామ్ మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హరికృష్ణ కి కుడి భుజం, ఎడమ భుజం వలె మారారు. అయితే ఎవరికివారే తమ తమ కెరీర్ లో బిజీ అయ్యారు. అయినా అన్న నటించిన సినిమా ఫంక్షన్స్ కి తమ్ముడు, తమ్ముడు ఫంక్షన్స్ కి అన్న వస్తూనే వున్నారు. తొలిసారి తన తమ్ముడు ఎన్టీఆర్‌తో తన తాత పేరు మీద స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో 'జై లవకుశ' నిర్మిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌బర్త్‌డే సందర్భంగా తన వీపు మీద ఎక్కిన ఎన్టీఆర్‌ని 'విష్ యూ హ్యాపీ బర్త్‌డే నాన్నా...' అని కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్‌ని తన నాన్నతో పోల్చాడు.
ఇక ఈ రోజు బుధవారం కళ్యాణ్‌రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెనుక నుంచి జూనియర్ తన అన్నయ్య భుజం మీద ఎంతో ప్రేమతో వేసిన చేతి ఫొటోను ట్వీట్ చేస్తూ..హ్యాపీ బర్త్‌డే అన్నా అంటూ.. ఆప్యాయంగా సంబోధించాడు. మొత్తానికి అన్నయ్య తన తమ్ముడిని ఆప్యాయంగా నాన్నా అని పిలిస్తే, జూనియర్ తన అన్నయ్యను పేరుతో కాకుండా అన్నయ్యా అని ఉద్వేగంగా పేర్కొనడం వారి మద్య ఏర్పడిన బంధానికి గుర్తుగా నిలుస్తుందనే చెప్పాలి. మరి వీరి అనుబంధం ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుందాం.