ఎంత అన్యోన్యంగా ఉన్నారు...

Update: 2017-09-02 08:07 GMT

పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.... మెగా ఫ్యామిలీ కూడా పవన్ ని దూరం పెట్టేసిందనే గాసిప్స్ ఎప్పటికపుడు ప్రచారం అవుతున్నవే. అసలు పవన్ కి మెగా ఫ్యామిలీతో సరిపడదని.. అందుకే వారికి కాస్త దూరంగా ఉంటాడనే టాక్ ఎప్పటినుండో ఉంది. కానీ మెగా ఫ్యామిలిలో రామ్ చరణ్ మాత్రం అలాంటివేం లేదు మా బాబయ్ పవన్ మేము చాలా సఖ్యతగా ఉంటామని చెప్పినా మీడియా ఊరుకోదు. అయినా రామ్ చరణేమో ఏం లేదంటాడు... పవన్ మరో అన్నగారు నాగ బాబేమో, వాడొక్కడేనా మీకు మెం లేమా.. అయినా వాడొస్తే ఏమిటీ రాకపోతే ఏంటి అంటుంటాడు.అయితే పవన్ కి మెగా ఫ్యామిలీకి మాత్రం మధ్య మంచి సఖ్యతే ఉందని కొన్నిసార్లు చరణ్ చెప్పినట్టు రుజువవుతూనే ఉంది.

మొన్న ఆగష్టు 22 న అన్నగారు చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పొచ్చాడు పవన్ అని ప్రచారం జరిగినా అదెవరు నమ్మలేదు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న అంటే ఈ రోజు శనివారం కన్నా ముందురోజు శుక్రవారమే పవన్ అన్నగారి ఆశీస్సులు అందుకుని వచ్చాడనే విషయం చిరు , పవన్ లు కలిసి దిగిన ఫోటోనే సాక్ష్యం. పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చుంటే చిరు మాత్రం పవన్ వెనుకగా నిలబడి ఎంతో ప్రేమతో పవన్ తల మీద చెయ్యి వేసిన ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. మరి ఈ ఫోటోని చూసిన ఎవరైనా... వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉంది అంటే నమ్మగలరా?

అయితే ఆ ఫోటో పక్కన గోడ మీద ఇంకో అద్భుత దృశ్యం కూడా కనబడుతుంది. అదేమిటంటే అచ్చం చిరు, పవన్ ల ఫోజున్న పిక్ లాగే గోడమీద చిరంజీవి, చరణ్ ల పిక్ వుంది. చరణ్ కూర్చుని ఉంటె చిరంజీవి మాత్రం చరణ్ నెత్తి మీద చెయ్యి చేసి ఆప్యాయంగా కౌగలించుకుని ఉన్న పిక్ అది. మరి ఆ ఫోటో ని చూసి మళ్ళీ కావాలనే పవన్, చిరు ఫోటో దిగారో లేకుంటే అది కాకతాళీయంగా జరిగిందో తెలియదు గాని... ఇప్ప్పుడు చిరు, పవన్ ల ఫోటో మాత్రం వైరల్ అయ్యింది.

Similar News