ఎంత అందంగా.. ఎంత సింపుల్ గా?

Update: 2018-03-20 04:51 GMT

టాలీవుడ్ లో ఇంకా టాప్ చైర్ లోనే కొనసాగుతుంది సమంత. తనతో పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వాళ్ళు అవకాశాలు కోసం ఎదురుచూస్తుంటే సమంత కి మాత్రం చేతినిండా అవకాశాలే. నాగ చైతన్య ని పెళ్లాడిన ఈ భామకు అస్సలు డిమాండ్ తగ్గలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలనుండి డి గ్లామర్ పాత్రలు, అలాగే రాజుగారి గది 2 లో అయితే ఆత్మాలా సమంత నటన సినిమాకే హైలెట్. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా ఆకళింపు చేసుకుని నటిస్తుంది. అందుకే సమంత కి భారీ డిమాండ్.. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్స్ లో సమంత టాప్ రేంజ్ లోనే ఉంది.

ప్రస్తుతం రంగస్థలంలో డి గ్లామరస్ పాత్రలో రామలక్ష్మి లా అదరగొడుతున్న సమంత, మహానటిలో సినిమా షూటింగ్ లో కూడా బిజీగా వుంది. అయితే నిన్నటిదాకా రంగస్థలం షూటింగ్ లో బిజీగా క్షణం తీరిక లేకుండా గడిపిన సామ్ ఇపుడు మహానటి షూటింగ్ లో కూడా అంతే గ్యాపులేకుండా షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే హీరో హీరోయిన్స్ సీన్ కి సీన్ కి మద్యన ఏ గొడుగు కిందో, ఏ కార్ వ్యాన్ లోనో కాస్త రెస్ట్ తీసుకుంటుంటారు. అందరి సంగతి ఏమో గాని సమంత మాత్రం మహానటి షూటింగ్ గ్యాప్ లో ఒక అసిస్టెంట్ గొడుగు పట్టుకుంటే కుర్చీలో కూర్చుని మరో చైర్ మీద కాళ్లు పెట్టుకుని రిలాక్స్ అవుతూ కనబడుతుంది.

మరి అలా రిలాక్స్ అవుతూ సమంత చిరునవ్వుతో కనబడుతున్న ఆ ఫోటో లోని సమంతని చూస్తుంటే మాత్రం అబ్బా సమంత సింపుల్ చీర కట్టులో ఎంత అందంగా.... ఎంత సింపుల్ గా ఉందొ అనకుండా ఉండలేము. అలాగే ఆ కుర్చీలో సమంత ఒక కునుకు తీస్తుంది కూడా. మరి ఆమె అసిస్టెంట్స్ మాత్రం సామ్ కి నిద్రా భంగం కలగకుండా అక్కడే కాచుకుని కూర్చున్నారు. మరి సమంత రిలాక్స్డ్ ఫోటో ని మీరు ఓ లుక్కేయండి.

Similar News