మెగాస్టార్ ఉయ్యాలవాడ ఎప్పుడు మొదలెడతారో గాని ఆ సినిమాపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. అలా ప్రచారమవుతున్న న్యూస్ ఫేక్ న్యూసో లేకుంటే నిజమైన న్యూసో అనేది మాత్రం అర్ధం కాకుండా ఉంది. కానీ రోజు రోజు ఈ ఊహాగానాలు మాత్రం శృతి మించి పోతున్నాయి. మొన్నటికి మొన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న లాంఛనంగా స్టార్ట్ చేస్తారని అన్నారు. కానీ ఆ ఆగష్టు 15 దగ్గరకు రానే వచ్చింది.... ఆ విషయమై ఎటువంటి అప్ డేట్ లేదు. అలాగే ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ కూడా హీరోయిన్స్ విషయమై వేటలో ఉన్నారని... ఒకసారి అనుష్కని ఫైనల్ చేశారంటారు... మరోసారి నయనతారతో చర్చలు జరిపారంటారు..... మధ్యలో ఐశ్వర్య రాయ్ చిరుకి జోడి అంటారు.
ఇక ఇప్పుడేమో ఉయ్యాలవాడ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ నటిస్తున్నాడంటూ వార్తలు. మరోవైపు కన్నడ స్టార్ సుదీప్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడంటూ న్యూస్. అయితే ఈ విషయాలపైనా మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడంలేదు..... కానీ సోషల్ మీడియాలో మాత్రం ఉయ్యాలవాడ న్యూస్ లు దావానంలా వ్యాపించేస్తున్నాయి. అయితే సుదీప్ తో ఉయ్యాలవాడ నిర్మాత చరణ్ చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలు నిజంకావని.. కానీ ఉయ్యాలవాడలో కన్నడ - తెలుగు మాట్లాడే వ్యక్తి రోల్ ఉంది కాబట్టి..... అందుకోసం ఉయ్యాలవాడ టీమ్ ఖచ్చితంగా నా దగ్గరకే వస్తారని నాకు తెలుసు.. అంటూ సెలవిచ్చాడు సుదీప్. అలా చెప్పిన సుదీప్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యాడు.
కానీ సుదీప్ ఉయ్యాలవాడలో నటించడాన్ని రామ్ చరణ్ ఖండించినట్లు వార్తలొస్తున్నాయి. అసలు ఉయ్యాలవాడ కోసం ఉయ్యాలవాడ చిత్ర యూనిట్ సుదీప్ ని సంప్రదించలేదని చెబుతున్నాడట చరణ్. మరి చరణ్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు అంటే ఉయ్యాలవాడలో సుదీప్ లేనట్లేగా.. మరి ఈ విషయమై సుదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.