యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్‌లో నేను శైలజకు ముందు వరకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఏదంటే కందిరీగ సినిమాయే. ఆ సినిమా రూపాయికి రెండు రూపాయల లాభం తెచ్చింది. ఆ సినిమా తర్వాత రామ్ రొటీన్ బాయ్ అయ్యి రొటీన్‌గా సినిమాలు తీసుకుంటూ పోవడంతో జనాలు కూడా రొటీన్ రామ్ అంటూ మనోడి సినిమాలు లైట్ తీస్కొన్నారు. ఆ తర్వాత రామ్ మార్కెట్ క్రమక్రమంగా డౌన్ అవుతూ వచ్చింది.
ఇక గతేడాది జనవరి 1న రామ్ నేను శైలజ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. కొత్త దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సంక్రాంతికి పది రోజుల ముందు వచ్చిన ఆ సినిమా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల హవా తట్టుకుని మరీ లాంగ్‌రన్‌లో రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. ఇదే రామ్‌కు కెరీర్ పరంగా హయ్యస్ట్ ఫిగర్.
రామ్ తన ఓవర్‌యాక్షన్‌కు బ్రేకులు వేస్తూ నేను శైలజలో కొత్తగా కనిపించడంతో పాటు తిరుమల కిషోర్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉండడంతో ఆ సినిమా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. తర్వాత మళ్లీ రామ్ రొటీన్ బాట పట్టడంతో హైపర్ ప్లాప్ అయ్యింది. హైపర్ తర్వాత రామ్ మళ్లీ మరోసారి తిరుమల కిషోర్‌నే నమ్ముకున్నాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించడంతో బయ్యర్లు గ్యారెంటీగా సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో మంచి రేట్లకే ఈ సినిమాను కొన్నారు. వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జిందగీ నైజాంలో రూ. 6 కోట్లు - సీడెడ్‌లో రూ. 3 కోట్లు - ఆంధ్రాలో రూ. 7 కోట్లు చేసింది. ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో మరో రూ.2 కోట్లు కలిశాయి.