రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి లు నటించిన 'ఉన్నది ఒకటి జిందగీ' సినిమా నిన్న శుక్రవారమే విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుని థియేటర్స్ లో రన్ అవుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్నేహం, ప్రేమ విలువలు చాటి చెప్పే చిత్రంగా అందరి మన్ననలు పొందుతుంది. ఈ శుక్రవారం ఎటువంటి పోటీ లేకుండా సోలో గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని ఈ చిత్రం దాదాపు 3 .63 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ సాధించిందని చెబుతున్నారు. గతంలో రామ్ 'నేను శైలజ'తో మొదటి రోజు 3 .45 కోట్లు కొల్లగొడితే.. ఇప్పుడు 'ఉన్నది ఒకటే జిందగీ' మొదటి రోజు 3 .63 కోట్లు కొల్లగొట్టి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకున్నాడు రామ్. ఇక ఏరియాల వారీగా 'ఉన్నది ఒకటే జిందగీ' మొదటి రోజు కలెక్షన్ కోట్లలో...
ఏరియా మొదటిరోజు షేర్ (కోట్లలో)
నైజాం 1.41
సీడెడ్ 0.50
నెల్లూరు 0.11
కృష్ణ 0.26
గుంటూరు 0.40
వైజాగ్ 0.42
తూర్పు గోదావరి 0.30
పశ్చిమ గోదావరి 0.23
ఏపీ మరియు తెలంగాణ మొదటి రోజు సాధించిన మొత్తం: 3.63 Cr