ఈసారి సూపర్ ఫాస్ట్ గా వుందే యవ్వారం!!

Update: 2017-07-07 09:00 GMT

'స్పైడర్' చిత్రం లేట్ తో మహేష్ బాబు అభిమానులకు సహనం చచ్చిపోయింది. ఫస్ట్ లుక్ కోసం, టీజర్ కోసం ఓపిగ్గా ఎదురు చూసిన వారు సినిమా విడుదల ఖచ్చితం గా దసరా కే ఉంటుందని గట్టినమ్మకంతో ఉన్నారు. ఇకపోతే 'స్పైడర్' రెండో టీజర్ ని కూడా ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మళ్ళీ చడీ చప్పుడు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మహేష్ అభిమానులు ఈ వార్త మంచి బూస్ట్ నిచ్చే వార్త. ఎందుకంటే మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా 'స్పైడర్' చిత్ర ట్రైలర్ గాని టీజర్ గాని విడుదల చెయ్యడానికి డైరెక్టర్ మురుగదాస్ గారు ఏర్పాట్లు మొదలుపెట్టారట.

ఒక్క 'స్పైడర్' టీజర్ మాత్రమేకాకుండా కొరటాల డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న 'భరత్ అను నేను' చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేసే యోచన చేస్తున్నారట. మరి ఒకేసారి మహేష్ అభిమానులకు రెండు సర్ప్రైజెస్ అన్నమాట. అయితే 'స్పైడర్' చిత్రం రెండు పాటల మినహా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంది. సినిమా కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ 27 న దసరా కానుకగా విడుదలవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది.

ఇక 'స్పైడర్' విషయంలో జరిగిన జాప్యం భరత్ విషయంలో జరగకూడదని మహేష్ బాబు పక్కా ప్లానింగ్ తోనే కొరటాల చేసే 'భరత్ అను నేను' సెట్స్ మీదకి వెళుతున్నాడట. అందుకోసమే విరామంలేని లాంగ్ డేట్స్ కూడా ఇచ్చేసాడని చెబుతున్నారు. 'స్పైడర్' చిత్రంలో రకుల్ ప్రీత్ మహేష్ కి జోడిగా నటిస్తుండగా... 'భరత్ అను నేను' లో బాలీవుడ్ భామ కైరా అద్వానీ మహేష్ తో జోడి కడుతుంది.

Similar News