అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, బావ బావమరుదులు ఇలా చాలానే బంధుత్వాలతో హీరోలు పలు భాషా సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఇక్కడ తెలుగులో అయితే మెగా హీరోలే చాలామంది ఉన్నారు. అలాగే నందమూరి హీరోలు, అక్కినేని హీరోలు, దగ్గుబాటి హీరోలు ఇలా వారసత్వంతో ఉన్న హీరోలు ఉన్నారు. ఇకపోతే ఒకే కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఒకే సినిమాలో కనబడం కొంచెం అరుదు. ఏదో క్యామియో రోల్స్ వేస్తారు గాని.. ఫుల్ లెన్త్ రోల్స్ లో కనబడరు.
అయితే ఇప్పుడు రాజా ది గ్రేట్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ఎఫ్ 2 ఫన్ & ఫ్రస్ట్రేషన్ సినిమాని ఒక మ్లల్టిస్టార్ర్ సినిమాగా తియ్యబోతున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోగా సీనియర్ హీరో వెంకటేష్ ని తీసుకోగా మరో హీరోని సాయి ధరమ్ తేజ్ అని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాలో వెంకీతో కలిసి నటించడానికి అసలు సాయి ధరమ్ తేజ్ ని అప్రోచ్ అవ్వలేదని దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు బాబాయ్ వెంకటేష్ అబ్బాయ్ రానాతో ఈ సినిమా చెయ్యాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట.
ఇప్పటికే ఈ ఫన్ & ఫ్రస్ట్రేషన్ సినిమాకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు రానా కూడా ఒకే చెప్పేస్తే.. ఈ సినిమా పట్టాలెక్కేస్తుందనే టాక్ వినబడుతుంది. అలాగే అనిల్ జోనర్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతుంది. అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందన్నమాట. మరి "కృష్ణం వందే జగద్గురుమ్" లో రానా హీరో అయితే.. వెంకటేష్ ఒక పాటలో కనబడి అలరించాడు. కానీ ఇప్పుడు రానా, వెంకీలు ఒకే సినిమాలో ఫుల్ లెన్త్ రోల్స్ లో కనబడి అభిమానులను అలరించనున్నారన్నమాట.