ఈసారి బికినీతో బిజీ అవ్వాలని

Update: 2017-07-06 14:00 GMT

టాలీవుడ్ లో క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ కి జంటగా 'కంచె'లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కి ఆసినిమా మంచి పేరునే తెచ్చిపెట్టింది కానీ ఆఫర్స్ తెచ్చివ్వలేకపోయింది. ఆ సినిమాలో ఎంతో సాంప్రదాయంగా కనబడిన ప్రగ్యా ఇండస్ట్రీలో మడి కట్టుకుని కూర్చుంటే కుదరదని తన తర్వాతి సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసి రెచ్చిపోయింది. నాగార్జున తో 'నమో వెంకటేశా'లో నటించిన ప్రగ్యా అక్కడ తన అందచందాలతో ఆకట్టుకుంది. అలాగే మనోజ్ హీరోగా వచ్చిన 'గుంటూరోడు'లో కూడా ప్రగ్యా గ్లామర్ షో బాగానే వుంది.

ఇక ఇప్పుడు తాజాగా 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కి జోడిగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో ప్రగ్యా ఇరగదీస్తున్నప్పటికీ... ప్రగ్యాని గ్లామర్ పరంగా రెచ్చిపోవడానికి డైరెక్టర్ కృష్ణ వంశి ప్రగ్యాకి సాయి ధరమ్ కి మధ్య ఒక మత్తెక్కించే సాంగ్ పెట్టాడు. 'ఏ పాపా యే పాపం చేసిందే నా గుండె.. నీ అందం అంటించే మంటల్లో చిక్కిందే' అంటూ సాగే ఈ పాటలో ప్రగ్యా జైస్వాల్ బికినీ తో రెచ్చిపోయినటించింది. తన అందచందాలతో గ్లామర్ కి హద్దులుండవని రుజువు చేసింది. మరి సాయి ధరమ్ తో చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ తో ప్రగ్యా కి అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయో? లేకుంటే ఎందుకులే అని లైట్ తీసుకుంటారో అనేది మాత్రం నక్షత్రం సినిమా హిట్ మీదే ఆధారపడివుంటుంది.

Similar News