ఈసారి పెళ్లి పక్కా

Update: 2017-12-01 08:48 GMT

ఎప్పటినుండో వినబడుతున్నట్టే హీరోయిన్ శృతి హాసన్ పెళ్లిపీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది శృతి. స్వీట్‌ హార్ట్‌ నెక్‌ లైన్‌ కట్‌ ఉన్న ఓ తెల్లటి మ్యాక్సీ డ్రెస్‌ వేసుకుని, జుట్టును బన్ను లాగా ముడేసుకుని, చెవులకు రెండు స్టేట్‌మెంట్‌ దుద్దులు పెట్టుకుని ఎంతో క్యాజువల్‌గా, ఎంతో సింపుల్‌గా తన సంతోషం బయట పడకుండా బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సేల్‌తో, తల్లి సారికతో కలిసి ఓ హై క్లాస్‌ రెస్టారెంట్‌లో లంచ్‌ చేసినట్లు కొన్ని ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతానికి చేతిలో సినిమాలేమి లేని శృతి హాసన్‌..... రెండేళ్ల నుంచీ కోర్సేల్ తో ల‌వ్ స్టోరీ న‌డుస్తోంది. ఇక శృతి హాసన్ ఆమె తల్లి సారిక, బాయ్ ఫ్రెండ్ మైఖేల్‌ కోర్సేల్‌ లు కలిసి లంచ్ చేసే టైం లో శృతి పెళ్లి ముచ్చట్లు మాట్లాడినట్టుగా... దానికి శృతి తల్లి సారిక ఒకే చెప్పేసినట్టుగా చెబుతున్నారు. ఇక కమల్ హాసన్ ఈ పెళ్లిని ఒకే చెయ్యడం ఒకటే మిగిలుందనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అయితే తండ్రి కమల్ కి ఇదివరకే లండన్ లో శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్‌ కోర్సేల్‌ ని పరిచయం చేసిందనే న్యూస్ ఉండనే ఉంది. సో.. కమల్ దగ్గరనుండి కూడా వీరి పెళ్ళికి ఎటువంటి అభ్యంతరాలుండవంటున్నారు. ఇక ఫైనల్ గా శృతి హాసన్ పెళ్లి భాజాలు మోగుతాయని.. అది కన్ఫర్మ్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Similar News