టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో గ్లామర్ షో చెయ్యకుండా చుడీదార్స్ లోనే కనబడిన రకుల్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నిటికి కేవలం గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కేవలం అందచందాలతోనే రకుల్ ఇంతవరకు రాగలిగింది కానీ ఆమెకు నటనలో ఏ మాత్రం ప్రావిణ్యం లేదంటున్నారు కొందరు. కానీ రకుల్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడి కట్టింది. కేవలం ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో మాత్రమే రకుల్ నటించలేదు. ఇక ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ - పవన్ కాంబోలో రాబోయే చిత్రానికి రకుల్ పేరు గట్టిగా వినబడుతుంది. ఒకవేళ ఫైనల్ అయితే రకుల్ కోరిక తీరిపోతుంది.
మరి ఎప్పుడూ గ్లామర్ షో చేసే రకుల్, నాగ చైతన్య తో నటించిన ,రారండోయ్ వేడుక చూద్దాం, లో మాత్రం కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న భ్రమరాంబ పాత్రలో ఇరగదీసింది. అయితే ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చెయ్యడానికి సిద్దమయ్యింది. డీ గ్లామర్‌గా ఉండే పాత్రని రకుల్ ఎంపిక చేసుకుందట. గ్లామర్ కి ఏమాత్రం స్కోప్ లేని విడో పాత్రలో రకుల్ కనిపించబోతోందట. పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వుండడంతో విడో క్యారెక్టర్‌కు రకుల్ ఓకే చెప్పిందన్నది ఇన్నర్ టాక్.
మరి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రకుల్ ఇలా డీ గ్లామర్ రోల్ చెయ్యడానికి ఎలా ఒప్పుకుందో అంటున్నారు. మరోపక్క ఎప్పుడూ గ్లామర్ డాల్ గా మాత్రమే ఏం చేస్తాం.... ఈసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసి తన మీద వస్తున్న వార్తలకు చెక్ పెడదామని రకుల్ భావిస్తుందని అంటున్నారు రకుల్ సన్నిహితులు.