మంచు మనోజ్ 'గుంటూరోడు' చిత్రం తర్వాత చేస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎప్పుడూ కామెడీని నమ్ముకుని సినిమాలు చేస్తున్న మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' తో ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మనోజ్ రెండు పాత్రలు చేస్తున్నాడు. ఒక పాత్రలో... ఎల్.టి.టి.ఇ తరహా మిలిటెంట్ గ్రూపు అధినేతగా మరొక పాత్రలో..... మరొక పాత్రలో నార్మల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ఈ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ లో మనోజ్ రెండు పాత్రల్లో పర్వాలేదనిపించాడు. ఒకవైపు బడుగు బలహీన వర్గాలకోసం పోరాడుతూ ఉంటాడు. 'ఒకవేళ భగత్ సింగ్ వంటి వారు ఇప్పుడు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే.. వారిని తీవ్రవాదులు అంటామా? స్వాతంత్ర్య సమరయోధులు అంటామా?' అనే థీమ్ తో రాబోతున్నాడు. అలాగే ఇంకోవైపు దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్నా అత్యాచారాల మీద దండెత్తే యువకుడిగా కనబడుతున్నాడు. ఈ చిత్రంతో మనోజ్ సమాజానికి ఉపయోగపడే ఒక మెస్సేజ్ ని ఇచ్చేలాగే కనబడుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే.
మరి ఈ చిత్రం తర్వాత మరో చిత్రాన్ని చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పి అంతలోనే మనసు మార్చుకున్న మనోజ్ ఈ 'ఒక్కడు మిగిలాడు' తో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అసలు మనోజ్ నుండి వస్తున్న సినిమాలన్నీ ఈ మధ్యన వరుసగా ప్లాప్ అవడంతో నిజంగానే మనోజ్ సినిమాలు మానేస్తాడేమో అని మనోజ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. కానీ అది నిజంకాదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' తో సెప్టెంబర్ 8 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.