పెద్ద పెద్ద దర్శకులు అప్పుడప్పుడు చిన్న హీరోస్ ని పెట్టి చిన్న సినిమాలు తీస్తుంటారు. ఇది ఒక మంచి ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి... సునీల్ ని హీరోగా పెట్టి మర్యాదరామన్న తీసాడు. అలాగే సుకుమార్ అందించిన కుమారి 21ఎఫ్ ఇలాంటి కోవలోకే వస్తుంది. కానీ ఇటువంటి ప్రయత్నానికి చాలా ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు దర్శకుడు కే రాఘవేంద్రరావు.
అప్పుడప్పుడే చిన్న చిన్న విలన్ వేషాలు వేస్తున్న శ్రీకాంత్ ను తీసుకువచ్చి పెళ్లిసందడి సినిమాకు హీరోని చేసాడు. ఈ సినిమాకి బడా ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి వాళ్లు ప్రొడ్యూస్ చేసారు. అయితే మళ్లీ రాఘవేంద్రరావు ఇప్పుడు తాజాగా కూడా అలాంటి ప్రాజెక్టు ఒకటి ట్రయ్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
చిన్న హీరోనిపెట్టి ఈ జెనరేషన్ ప్రేక్షకుల కోసం ఓ సినిమా చేయబోతున్నాడట రాఘవేంద్రరావు. అందుకే ఓ డిఫరెంట్ సబ్జక్ట్ కోసం ఆయన చూస్తున్నారట. అలా కొత్త కథ దొరకగానే.. ఒక చిన్న సినిమా ఆయన డైరక్షన్ లోనే స్టార్ట్ చేసేస్తారు. మరి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గటే సినిమా తీస్తే బాగానే ఉంటుంది. అయితే అదే ఆలోచనలో రాఘవేంద్రరావు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాను మీడియం సినిమాలు తీసే రాఘవేంద్రరావు హోమ్ బ్యానర్ లాంటి ఆర్కా మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుందనే టాక్ వినబడుతుంది.