ఈసారి అర్జున్ రెడ్డిని రాక్ లైన్ ఎగరేసుకుపోయాడు

Update: 2017-09-10 16:02 GMT

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి సినిమా గురించిన హడావిడి ఇంకా ముగియలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇప్పటికి కలెక్షన్స్ కొల్లగొడుతూనే వుంది. చిన్న సినిమా గా విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం ఇంతటి కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంటే.... ఇతర భాషల వారు తమ భాషలోకి రీమేక్ చేసి కోట్లు గడించాలని చూస్తున్నారు. అందుకే ఇతర భాషల నుంచి ఈ సినిమాకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ లో ధనుష్ ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ని భారీ ధరకి కి సొంతం చేసుకున్నారు అని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పడు అర్జున్ రెడ్డి కన్నడ రీమేక్ హక్కులకు సంబందించిన డీల్ కూడా దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఓ కన్నడ బడా నిర్మాత అర్జున్ రెడ్డి హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు రాక్ లైన్ వెంకటేష్, తెలుగులో రవితేజతో పవర్ సినిమాని నిర్మించడంతో పాటు.... రజనీకాంత్ లింగా కు కూడా నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఈమధ్య జోరు తగ్గించాడు. ఆచితూచి సినిమా కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అతను అర్జున్ రెడ్డి హక్కులని తీసుకొని ఓ ప్రముఖ కథానాయకుడితో కన్నడలో రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు.

ఇక అర్జున్ రెడ్డి హిందీ హక్కుల కోసం మాత్రం పెద్దగా పోటీ ఏమి లేదని..... ఈ సినిమా అక్కడ రీమేక్ కాకపోవచ్చు అని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. చూద్దాం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి పొజిషన్ ఎలా ఉంటుందో.. రీమేక్ అవుతుందో లేకపోతె డబ్బింగ్ చేస్తారో...!

Similar News