ఈ స్టార్ హీరోలు ఈ విషయంలో రివర్స్ అయ్యారు

Update: 2018-03-04 05:25 GMT

గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్స్ - స్టార్ హీరోల సినిమాలకు మొదట ఎంపిక చేసిన సినిమాటోగ్రాఫర్స్ ని కాకుండా తర్వాత కారణాలు బయటికి రానివ్వకుండా ఉన్నట్టుండి మార్చేస్తున్నారు. అసలు ఒక్కోసారి కొంత షూటింగ్ పూర్తయ్యాక సడన్ గా సినిమాటోగ్రాఫర్స్ తప్పుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. అసలు సినిమాకి మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉండడం ఎంతో కీలకం కూడా. అసలు సినిమాలు ని ఎంతో కొత్తగా... రిచ్ గా చూపెట్టడంలో సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చాలా కీలకం. అందుకే స్టార్ హీరోస్ తమ సినిమాలకు టాప్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుంటూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు తమ కొత్త చిత్రాల కోసం టాప్ రేంజ్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుని ఎనౌన్స్ కూడా చేశారు. కానీ వారిప్పుడు ముందు అనుకున్న వారిని కాకుండా కొత్తవారిని తీసుకున్నారు. ఆ స్టార్ హీరోలెవరో కాదు ఒకరు మహేష్ బాబు, మరొకరు ఎన్టీఆర్. మహేష్ - వంశి పైడిపల్లి చిత్రానికి గాను ముందుగా సినిమాటోగ్రాఫర్ గా ‘మనం, ఊపిరి, ధృవ, విక్రమ్ వేద’ లాంటి సినిమాలకు పని చేసిన పి.ఎస్.వినోద్ ను అనుకున్నారట. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రం సినిమాకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయిన మోహనన్ ని తీసుకున్నారట.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి అనుకున్న మోహనన్ మహేష్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండాగా... మహేష్ బాబు కి అనుకున్న పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడట. మరి ఈ స్టార్ హీరోల సినిమాలకు ముందు అనుకున్న సినిమాటోగ్రాఫర్స్ వేరు ఇప్పుడు పనిచేస్తున్నవారు వేరు. మరి ఎన్టీఆర్ కి చెయ్యాల్సిన వాడు మహేష్ కి, మహేష్ కి చెయ్యాల్సిన వాడు ఎన్టీఆర్ కి అలా రివర్స్ అయ్యారన్నమాట.

Similar News