ఈ సాంగ్ కోటి వ్యూవ్స్ తో దూసుకుపోతుంది

Update: 2018-02-27 03:57 GMT

లవర్స్ డే నాడు రిలీజ్ అయిన 'రంగస్థలం' సినిమాలో 'ఎంత సక్కగున్నవే' సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందంటే... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ పాటె వినిపిస్తుంది. అంతలా ఆకట్టుకున్న ఈ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ లో ఏదో చెప్పలేని మ్యాజిక్ ఉందని అందరు చర్చించుకుంటున్నారు. అలాగే చంద్ర బోస్ రాసిన లిరిక్స్ కూడా పాటకు ప్రాణంలా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు 199K లైకులతో కోటి పైగా వ్యూస్ ని అందుకొని దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో సమంత హావభావాలు.. చరణ్ మూమెంట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి అని వినికిడి.

మార్చ్ 30న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది. మరికొన్ని రోజుల్లో సెకండ్ సింగల్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటోంది.

Similar News