ఈ సంబరాలు ఎందుకని ప్రశ్నిస్తున్న హీరోయిన్

Update: 2018-01-14 12:22 GMT

లీడర్ చిత్రంతో రానా దగ్గుబాటి తో పాటు వెండితెరకి పరిచయమైన తెలుగు అమ్మాయి ప్రియా ఆనంద్, ఎన్.ఆర్.ఐ అమ్మాయి రీచా గంగోపాధ్యాయ గుర్తుండే వుంటారు. ప్రియా ఆనంద్ తమిళ చిత్రాలలో బిజీ కాగా రీచా గంగోపాధ్యాయ రవితేజ సరసన మిరపకాయ్, ప్రభాస్ సరసన మిర్చి లో కనిపించింది. తరువాత తరువాత సినిమా అవకాశాలు తగ్గు ముఖం పెట్టటంతో కనుమరుగైపోయిన రీచా తిరిగి అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని టాక్ వినపడింది. ఇక ఇంత కాలానికి అమ్మడు తన ఉనికిని కాపాడుకోవటానికి చేసినట్టు ఒక ట్వీట్ తో అందరి దృష్టిలో మరోసారి మెదిలింది.

ఒకప్పుడు సినిమా అభిమానులకి, స్టార్ హీరోల అభిమానులకి సినిమా విడుదల రోజు, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చిత్రమైతే 100 రోజుల వేడుక వంటి ప్రత్యేకమైన రోజునే వారి అభిమానాన్ని చాటుకునే విధంగా సంబరాలు జరుపుకునే అలవాటు ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిత్రానికి ఫస్ట్ యానివర్సరీ, 2 ఇయర్స్ ఆఫ్ అవర్ హీరో ఫిలిం అనే టాగ్ లతో సంబరాల హోరు బాగా ఎక్కువ అయిపోయింది. రీచా గంగోపాధ్యాయ ఈ పరిణామాన్ని కోట్ చేస్తూ హాలీవుడ్ లో లేని ఇలాంటి సంస్కృతి ఇండియన్ ఫిలిం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారని, ఈ సంబరాల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని, అలా చేసుకోవాల్సి వస్తే రెండు దశాబ్దాల టైటానిక్ వేడుక ఎంత ఘనంగా జరిగి ఉండేదని సోషల్ మీడియా ఫాలోయర్స్ కి ఎదురు ప్రశ్న సంధిస్తోంది రీచా. రీచా ఈ విషయాన్ని ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకుని ఉంటుందో?

Similar News