ఎన్టీఆర్ 'జై లవ కుశ' లోని 'జై' టీజర్ ఒకపక్క యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుంటే మరోపక్క ఎన్టీఆర్ 'జై' కేరెక్టర్ ని పూరి కథ నుండి కాపీ కొట్టేశాడనే వార్త సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథలోని కేరెక్టర్... 'జై' కేరెక్టర్ ఒకలాగే ఉందంటూ గత రెండు రోజులుగా ఒకటే న్యూస్, మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ - పూరి కాంబోలో వచ్చిన 'టెంపర్' హిట్టవ్వడంతో పూరి, ఎన్టీఆర్ కోసం మరో కథని రెడీ చేసాడట. ఇక దాన్ని ఎన్టీఆర్ కి కూడా వినిపించాడట. అయితే ఆ కథలోని హీరోగారి పాత్రకి నత్తి ఉంటుందట. మరి నత్తి ఉన్నందువలన ఆ హీరోగారు ఎవరితో మాట్లాడకుండా కామ్ గా ఉంటుంటాడట. మాట్లాడితే తనలోని లోపం నలుగురికి తెలుస్తుందని భయంతో.
అదిగో పూరి రాసుకున్న కేరెక్టర్... 'జై లవ కుశ' లోని 'జై' పాత్ర ఒకేలా ఉండడంతోనే సమస్యల్లా వచ్చిందట. ఇదే విషయాన్నీ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంత క్లియర్ గా రాయడం వెనుక ఒకరి పాత్ర ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అసలు ఇది లీకైందా..? ఎవరైనా లీక్ చేశారా..? అంటే ఎవరోకావాలనే లీక్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇంత అవసరం వారికి ఏం వచ్చిందో గాని.. దీని వెనుక పూరి ఫ్రెండ్ ఛార్మి ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. పూరి చేసే వ్యాపారం పూరి కనెక్ట్ సంస్థతో ఛార్మి, పూరి దగ్గరే తిష్ట వేసిందనే సంగతి తెలిసిందే. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు పూరి కనెక్ట్ సంస్థతో టై అప్ ఉన్నదట. అందుకే ఆ పత్రికకు చార్మి నే ఈ విషయాన్ని లీక్ చేసిందని... అందుకే వారు అంత ధైర్యంతో దాన్ని ప్రచురించారనే వాదన తెరపైకి వచ్చింది.