ఈ యువ హీరో పరిస్థితి ఏంటి ఇలా మారింది!

Update: 2018-03-07 11:00 GMT

నెలకి ఓ కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోల తాకిడి బాగా పెరిగిపోయింది. వారి ప్రతి సినిమాతో ఉనికిని చాటుకోవడం అత్యవసరం. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారంటే.. ఒక్క సక్సెస్ తో అంనందపడిపోకూడదు. ఆ సక్సెస్ గ్రాఫ్ ని అలానే కంటిన్యూ చేయాలి. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.

మొన్న సంక్రాంతికి విడుదల ఐన రంగుల రాట్నం పెద్ద ప్లాప్ అవ్వడంతో తన మార్కెట్ కి పెద్ద దెబ్బ తగిలింది. రాజ్ తరుణ్ న్యూ మూవీ రాజుగాడు సినిమాని వాయిదా వేశారు. అదే నిర్మాత తన ఇంకో సినిమా కిర్రాక్‌ పార్టీని ముందుగా విడుదల చేస్తున్నారు. నిఖిల్ కు సక్సెస్ రేట్ ఉంది కాబ్బటి ముందుగా కిర్రాక్‌ పార్టీని రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.

ఏప్రిల్.. మే లో పెద్ద సినిమాలు రెలీజ్స్ వున్నాయి కాబ్బట్టి రాజుగాడు రిలీజ్‌ అవడానికి మరి కాస్త సమయం వేచి చూడక తప్పదు. ఈలోగా రాజ్ తరుణ్ ఇంకో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయిపోతుంది. మంచి సీజిన్ దొరికినప్పుడు సినిమాను రిలీజ్ చేసుకుంటే బాగుంటది కానీ.. కాళీ గా వున్నప్పుడు రిలీజ్ చేస్తే రాజుగాడు రిలీజ్‌ అవడానికి మరి కాస్త సమయం వేచి చూడక తప్పదు. ఏదిఏమైనా రాజ్ తరుణ్ కెరియర్‌ కాస్త డేంజర్‌లోనే ఉంది. అర్జంటుగా రెండు మూడు హిట్స్ వస్తే తప్ప మల్లి పుంజుకోడం కష్టమే అంటున్నారు సినీ పండితులు.

Similar News