హీరో నిఖిల్ కి ఇప్పుడు పరిశ్రమలో మంచి టైం నడుస్తుంది. వరుస హిట్స్ తో 'హ్యాపీ డేస్' అంటూ దూసుకుపోతున్నాడు. అయితే నిఖిల్ కి ముందునుండి ఇండస్ట్రీ లో కొత్త కథలని ఎంకరేజ్ చేస్తాడు అనే మంచి పేరు. దానికి తగ్గట్టు గానే నిఖిల్ కూడా కొత్త రకమైన కథలతో ఎక్సపర్మెంట్స్ చేస్తున్నాడు. కానీ నిఖిల్ గత చిత్రం అయిన 'కేశవ' మూవీ బాక్స్ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు హీరో నిఖిల్ తన నెక్స్ట్ సినిమా గా ఒక రీమేక్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు. నిఖిల్ కన్నడ హిట్ చిత్రం అయిన 'కిరిక్ పార్టీ' రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం లో నిఖిల్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి ఉంది. అందులో ఆల్రెడీ ఒకరిని సినిమా బృందం ఎంపిక చేసింది.
శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో నిఖిల్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఆల్రెడీ కన్నడ 'కిరిక్ పార్టీ' లో హీరోయిన్ గా చేసిన సంయుక్తా హెగ్డే నే తెలుగు లోకి కూడా తీసుకున్నారు.కానీ ఇంకో హీరోయిన్ గురించి వివరాలు తెలియాల్సి ఇంకా ఉంది. ఇక ఈ సారి ఎలా అయినా యూత్ ఫుల్ హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్న నిఖిల్ ఈ మూవీ కోసం జిమ్ లో చాలానే కష్టపడుతున్నాడట. ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ మధ్యన నిఖిల్ పెళ్లి... పీటలవరకు వచ్చి ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ విషయమై స్పందించిన నిఖిల్... పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదని ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉన్నట్లు నిఖిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.