ఈ మూడు సినిమాలు 260 కోట్ల బిజినెస్ దాటేశాయి!

Update: 2018-02-23 10:30 GMT

ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ లో టాలీవుడ్ మూడో స్తానంలో ఉండేది. ఈ మధ్య కాలం నుండి టాలీవుడ్ మార్కెట్ కొచం కొంచం పెంచుకుంటూ వెళ్తుంది. అత్యధిక మార్కెట్ లో బాలీవుడ్..కోలీవుడ్ తర్వాత టాలీవుడ్ ని సంబోదించేవారు. కానీ మన డైరెక్టర్స్ వల్ల మన సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నాయి. టాలీవుడ్ మార్కెట్ కూడా బాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుంది. ఈ విషయం గురించి రాజమౌళి బాహుబలి ప్రొమోషన్స్ అప్పుడు చెప్పారు.

ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపించేందుకు సుకుమార్..కొరటాల శివ..వక్కంతం వంశి బాధ్యతలు తీసుకున్నారు. మన స్టార్ హీరోస్ సినిమాలు ఈ సమ్మర్ లో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయనున్నాయి. మహేష్..రామ్ చరణ్..బన్నీ లాంటి హీరోల సినిమాలు ఈ సమ్మర్ లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 260 కోట్ల బిజినెస్ చేసేలా ఉన్నాయి. మరి అంత కాకపోయినా కనీసం 225 కోట్ల దాటుతాయని అంచనాలున్నాయి.

ముందుగా చరణ్ సినిమా వస్తుంది. ఈ సినిమా 80 కోట్ల ప్రీ బిజేసన్ చేసింది. దర్శకుడు సుకుమార్ కాబట్టి కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. భరత్ అనే నేను ఆల్రెడీ 100 కోట్లు ప్రీ బిజినెస్ చేసింది. అలానే అల్లు అర్జున్ సినిమా కూడా 80 కోట్లతో ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా షేర్స్ సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ పండితులు చెబుతున్నారు

Similar News