సినిమా బాగుందన్నారు. సూపరన్నారు. అంతేకాకూండా డైరెక్టర్ తో సహా అందులో పని చేసిన టెక్నికల్ టీం మొత్తాన్ని మెచ్చుకున్నారు. యునివెర్సల్ హిట్ అని పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు. కానీ రెండో రోజు సినిమా డల్ అయింది. ఇంతకీ ఈ టాపిక్ అంత ఏ సినిమా గురుంచి అనుకుంటున్నారు. అదేనండి అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా గురించే. అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన హలో రెండో రోజేకే ఈ సినిమాను ప్రదర్శితున్న థియేటర్స్ బోసిపోయాయి.
సాధారణంగా టాక్ బాగుంటే.. శనివారం రోజున క్రౌడ్ పెరుగుతుంది. అందులో వీకెండ్ కూడా వచ్చింది. కానీ థియేటర్స్ హౌజ్ ఫుల్స్ కావటంలేదు. కానీ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ హలో సినిమాకు వసూళ్లు పెరగలేదు. మొదటి రోజు 3 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు కేవలం కోటి 83 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. హలో కి మిగిలింది ఇంకా 2 రోజులు. బుధవారం నుండి మళ్లీ థియేటర్లకు అన్-సీజన్. మరి ఈ రెండు రోజులు హలో వసూల్ పరంగా ఏమైనా దూసుకుపోతుందో లేదో? చూడాలి.
హిట్ టాక్ వచ్చినా సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపలేదంటే.. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి వస్తుందా అనేది మాత్రం పెద్ద డౌట్. మరి నాగార్జున కి ఫెవర్ గా క్రిటిక్స్ కూడా ఈ సినిమాని హిట్ చేసిపాడేశారు. కానీ క్రిటిక్స్ హిట్ అనడం, టాక్ బావున్నా సినిమాకి కలెక్షన్స్ లేవంటే అది నాగ్ బ్యాడ్ లక్కా? లేకుంటే అఖిల్ బ్యాడ్ లక్కా? అనేది వారికే తెలియాలి.