ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ నంది అవార్డ్స్. ఈ సారి ఇచ్చిన నంది అవార్డ్స్ కాదని.. సైకిల్ అవార్డ్స్ అని మెగా క్యాంప్ నుండి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నంది అవార్డులకు సంబంధించి మెగా - నందమూరి 'క్యాంప్'ల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే ఇవేవి మాకు సంబంధం లేదు అని..సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫోటో చూస్తే మీకే అర్ధం అవుతుంది.
ఒకరేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రాహ్మణి కాగా, ఇంకొకరేమో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కోడలు ఉపాసన. వీరు ఇద్దరు కలిసి దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'రక్తదానం' పై అవగాహన కల్పించేందుకు దిగిన ఈ ఫోటో మెగా - నందమూరి క్యాంప్ లలో ఫుల్ జోష్ ని నింపింది. ఇక నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు. హెరిటేజ్ సంస్థ కార్యకలాపాల్ని ఆమె స్వయంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రికి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇద్దరు కలిసి దిగిన ఈ ఫోటో.. మా బంధం ధృఢమైనది అన్నట్లుగా వుంది.