ఈ 'ప్రయాణం' ఎటు వైపో...?

Update: 2018-01-27 08:00 GMT

మంచు మనోజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై పుష్కర కాలం గడుస్తున్నప్పటికీ మనోజ్ ని స్టార్ హీరో ని చేసే సాలిడ్ హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా అతని కెరీర్ లో పడలేదు. బిందాస్ వంటి మోస్తరు విజయాన్ని తప్పితే సోలో హీరోగా పెద్దగా కమర్షియల్ విజయాలు అంటూ ఏమి లేవు మనోజ్ కి. నేను మీకు తెలుసా, ప్రయాణం వంటి చిత్రాలు ప్రశంసలు పొందినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్స్ గానే నిలిచాయి. అయితే ఇప్పటికి కూడా మనోజ్ సినిమాలలో క్లాస్ ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రం మాత్రం ప్రయాణమే.

తొలి ప్రయాణంతో....

ఈ మధ్య కాలంలో సౌర్య, ఎటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఇచ్చిన మనోజ్ మరొక సారి తనకి మెమొరబుల్ చిత్రాన్ని ఇచ్చిన స్పెషల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోనే పని చేయటానికి మక్కువ చూపుతున్నాడు. అయితే ఈ సారి యేలేటి స్టైల్ లో కథ నడుస్తూనే అందులో కమర్షియల్ ఎలెమెంట్స్ మెండుగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మనోజ్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తెలియజేస్తారు. వీరి కలయికలో తొలి 'ప్రయాణం' విమర్శకుల మనసులు దోచుకుంది. మరి ఈ మరో 'ప్రయాణం' ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందేమో చూద్దాం.

Similar News