అనుష్క మెయిన్ లీడ్ లో అశోక్ తెరకెక్కించిన భాగమతి చిత్రం వసూళ్ల వర్షం కురికిస్తుంది. లాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఆదివారం అమెరికాలో 1మిలియన్ డాలర్ల కల్లెక్షన్లను దాటేసి ఔరా అనిపించింది. సౌత్ లో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అమెరికాలో 1మిలియన్ సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
మొదటి వారంలోనే 870 వేల డాలర్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో వారం లో 130 వేల డాలర్లు సాధించి మొత్తంగా 1మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. దీన్ని బట్టి అనుష్క క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనేది ఈ భాగమతి తో అర్ధమవుతుంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశ శరత్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ , ప్రమోద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వారు అధిక లాభాలు జేబులో వేసుకునే అవకాశాలు ఉన్నాయి.