సెలెబ్రెటీస్ అంటే వారి హోదాకి తగ్గట్టు నడుచుకుంటుంటారు. వారి ఇమేజ్ ని దెబ్బ తీసే ఏ విషయం ఐన వారికి నచ్చదు. అయితే ఒకే ఈవెంట్ లో గోవా బ్యూటీ ఇలియానాను రెండు సార్లు హర్ట్ చేసాడు ఒక జర్నలిస్ట్. ఇలియానా ప్రస్తుతం రెయిడ్ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా వుంది.
హీరో అజయ్ దేవగన్ తో కలిసి పబ్లిసిటీ యాక్టివిటీస్ లో తెగ పార్టిసిపేట్ చేస్తోంది. అయితే ఓ ఈవెంట్ లో ఒక జర్నలిస్ట్ తెగ అత్యుత్సాహంతో.. 'ఇవాళ మనం సూపర్ స్టార్ అజయ్ దేవగన్.. ఇలియానా డిసౌజాలతో ఇక్కడ ఉన్నాం' అన్నాడు. ఇలియానా ఇంటి పేరు మార్చేయడమే కాదు.. హీరోకు సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చి..ఇలియానాను ఏకవచనంలో సంబోధించాడని గుర్తుంచుకోవాలి.
అయితే ఇలా ఒక్కసారి జరిగితే పర్లేదు. మళ్లీ ఆ రిపోర్టర్ ఆ మాటను రిపీట్ చేశాడు. అంతే వెంటనే ఇలియానా ఆగ్రహంతో.. నువ్వు ముందు కొంత హోంవర్క్ చేసి రావాల్సి ఉందని.. పేర్లు ఇలా మిక్స్ చేసి చెపుతుంటే చాలా చండాలంగా వుంది అని చాలా మర్యాదగా ఆ రిపోర్టర్ కు చెప్పింది.