కెరీర్ లో 100 చిత్రాల మైలు రాయి అరుదైన ఘనతగా భావించే నేటి తరంలో మెగా స్టార్ చిరంజీవి తరువాత ఆ సంఖ్య దాటినా హీరో నట సింహం నందమూరి బాల కృష్ణ. ఈ 100 వ చిత్రం నుంచే తన కథల ఎంపికలో వైవిధ్యం తప్పక కనపడుతుందని మాట ఇచ్చిన బాలయ్య 100 వ చిత్రం చారిత్రాత్మక కథని, తరువాత 101 మరియు 102 చిత్రాలలో ఇప్పటి వరకు చేయని తరహా మాస్ పాత్ర మరియు సెంటిమెంట్ పండించే పాత్రలో మెప్పించిన బాలయ్య 103 వ చిత్రంగా తన తండ్రి సర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ కి సిద్దమైన సంగతి విదితమే.
ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం రామారావు వర్ధంతి నాడు ఈ చిత్ర టీజర్ విడుదల కావలసి ఉన్నప్పటికీ దర్శకుడు తేజ కట్ చేసిన టీజర్, దానికి వాడిన లైటింగ్ ఎఫెక్ట్స్ మరియు మేకింగ్ వాల్యూస్ బాలయ్య ని తృప్తి పరచలేకపోయాయని టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ రాజీ పడటం ఇష్టం లేని బాలయ్య టీజర్ విడుదల ప్లాన్ నిలిపి వేసారట. ప్రస్తుతం తేజ విక్టరీ వెంకటేష్ చిత్రంతో బిజీ అవుతుండటంతో ఆయన పనితనంపై అసంతృప్తితో ఉన్న బాలయ్య ఈ గ్యాప్ లో మరో దర్శకుడికి ఎన్.టి.ఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా వున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.